గులాబీ బాస్ KCR ఆందోళన.. తనయుడు కేటీఆర్‌కు కీలక ఆదేశాలు

11 months ago 21
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాల్లోని పార్టీ నేతలతో ఆయన ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పార్టీ శ్రేణులు తమ వంతుగా ప్రజలకు సహాయక చర్యలు అందించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article