Yashwantpur Express Train at Gooty Railway Station: గుత్తి రైల్వేస్టేషన్‌లో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. జాయింట్ కప్లింగ్ ఊడి రెండు బోగీలు రైలు నుంచి విడిపోయాయి. రైలు నుంచి ఎస్ 6, ఎస్7 బోగీలు రైలు నుంచి విడిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన లోకోపైలెట్ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటక నుంచి బిహార్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.