శ్రీవేంకటేశ్వర స్వామివారిపై భక్తితో ఓ వృద్ధ దంపతులు ఖరీదైన కిరీటం చేయించారు. ఈ కిరీటాన్ని జనవరి 2025లో ఆలయ అధికారుల సమక్షంలో సమర్పించారు. కానీ, ఆలయ కమిటీ చేతివాటం ప్రదర్శించింది. స్వామివారి కిరీటంపై కన్నేసిన కమిటీ ఛైర్మన్, సభ్యులు.. దానిని ఓ మార్వాడీ దుకాణానికి తీసుకెళ్లి తాకట్టు పెట్టారు. స్వామివారికి దానిని అలంకరించకపోవడంతో దాతలకు అనుమానం వచ్చింది. వారు ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.