Chandrababu Serious On Guntur Woman incident: గుంటూరులో ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితలు సీరియస్ అయ్యారు. గుంటూరు ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకున్నారని.. ఇప్పటకే కేసు నమోదు చేశారన్నారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన మూర్తిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.