గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదే నెలలో కడప జిల్లాలో కోవిడ్ కేసులు నమోదవ్వడం, అందులో మరణాలు కూడా సంభవించడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. గుంటూరు కోవిడ్ కేసుల్లో ముగ్గురూ ఆడవాళ్లే కావడం విశేషం. అందులో ఒకరు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ముగ్గురి నమూనాలను పుణెలోని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వైద్యారోగ్య శాఖతో పాటు జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు.