YSRCP Provides 20 lakh Financial Assistance to Gade Sai krishna mother: గాదె సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ నేతలు అండగా నిలిచారు. వడ్డేశ్వరంలో ఉన్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని వైసీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటుగా మరికొందరు కాపు నేతలు విజయలక్ష్మిని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు గాదె విజయలక్ష్మికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.