గణేష్ మండపం పక్కనే చికెన్ బిర్యానీతో భోజనాలు.. వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై కేసు

10 months ago 13
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం రసాభాసగా మారింది. మాజీ సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంగళవారం వైసీపీ శ్రేణులు స్థానిక గాంధీ సెంటర్లో కార్యక్రమం, అన్నదానం నిర్వహించారు. అయితే గాంధీ సెంటర్లో గణేష్ మండపం పక్కనే కార్యకర్తలకు వైసీపీ నేతలు చికెన్ బిర్యానీతో భోజనాలు వడ్డించటం వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article