గంటా శ్రీనివాసరావు వర్సెస్ విష్ణుకుమార్ రాజు.. రోడ్డుపైనే వాదనలు.. అసలేంటీ పంచాయితీ?

1 year ago 29
విశాఖలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పొడసూపాయి. ఫిలిం నగర్ లీజు వ్యవహారంపై విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటం ఇందుకు కారణమైంది. అయితే వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తన భీమిలి నియోజకవర్గం పరిధిలోని అంశమని.. తనకు తెలియకుండా ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారంటూ గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. దీనిపై బహిరంగంగా విష్ణుకుమార్ రాజుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం అంశంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని ఘాటుగా అన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article