క్రికెట్‌పై అభిమానం ప్రాణాలు పోయేంత ఉండొద్దు.. యముడి దగ్గర DRS ఉండదు: సీపీ సజ్జనార్

3 months ago 18
స్కూటీ నడుపుతూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న యువకుడి వీడియోపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. క్రికెట్‌లో డీఆర్ఎస్ ఉంటుంది కానీ.. మరణం తర్వాత యముడి వద్ద రివ్యూ ఉండదని ఆయన హెచ్చరించారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతే కుటుంబ సభ్యులు అనాధలవుతారని గుర్తు చేశారు. అభిమానం ఉండొచ్చు కానీ అది ప్రాణాలు తీసే వెర్రి పిచ్చిగా మారకూడదని, రోడ్లపై వాహనాలు నడిపేవారు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు.
Read Entire Article