తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వారం రోజుల్లో ప్రారంభం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా.. 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్డులను పంపిణీ చేస్తారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాగితపు కార్డుల స్థానంలో పీవీసీ స్మార్ట్ కార్డులను ఇవ్వడం ఇదే తొలిసారి. క్యూఆర్ కోడ్, హెచ్‌ఓఎఫ్ వివరాలు, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫొటోలతో ఈ కార్డులను రూపొందించారు.