"కోర్టులకు మీరిచ్చే గౌరవం ఇదేనా?": విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాపై తెలంగాణ హైకోర్టు ఫైర్

3 weeks ago 5
తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారుల అలసత్వంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కారుణ్య నియామకాలకు సంబంధించి 2023లో ఇచ్చిన న్యాయస్థాన ఉత్తర్వులను అమలు చేయకపోగా.. కోర్టు ధిక్కరణ నోటీసులకు స్పందించి విచారణకు హాజరు కాకపోవడంపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాపై జస్టిస్ టి.మాధవీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కోర్టులకు మీరిచ్చే గౌరవం ఇదేనా' అంటూ ఘాటుగా నిలదీశారు. మధ్యాహ్నంలోగా కోర్టుకు జరుకావాలని అల్టిమేటం జారీ చేశారు. దీంతో నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న సదరు ఐఏఎస్ అధికారిణి ఆన్‌లైన్‌ ద్వారా వర్చువల్‌గా హాజరై న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు.
Read Entire Article