Andhra Pradesh Govt Orders On Vehicle Registration Within 24 Hours: ఏపీ ప్రభుత్వం చెప్పినట్లుగానే చేసింది.. కొత్త వాహనాలకు సంబంధించిన పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తిచేయనుంది. ఈ మేరకు కొత్త విధానంపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను రవాణాశాఖ అధికారులు 24 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదించకపోతే డీమ్డ్ టు అప్రూవల్ కింద ఆమోదం తెలిపినట్లే అవుతుంది.