కొత్తగా జింకల పర్యాటక కేంద్రం.. పచ్చని ప్రకృతి ఒడిలో, తుంగభద్ర నదికి సమీపంలో

3 weeks ago 4
Dibbanadoddi New Deer Park: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా టూరిజంపై ఫోకస్ పెట్టింది. తాజాగా రాయలసీమలో కొత్తగా జింకల పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లా మంత్రాలయానికి సమీపంలో తుంగభద్ర నదికి సమీపంలో ఈ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. దిబ్బనదొడ్డిలో అటవీశాఖకు చెందిన భూమిలో ఈ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు భూముల్ని పరిశీలించి జింకల పార్క్ ప్రతిపాదనల్ని రూపొందించారు. ఆదోని డివిజన్ పరిధిలో 10వేలకుపైగా జింకలు ఉన్నాయంటున్నారు.
Read Entire Article