కొత్త సంవత్సరం వేళ సామాన్యుడికి బిగ్ షాక్.. పెరిగిన కూరగాయల ధరలు.. వాటి ధర కిలో రూ.400..

6 months ago 20
కొత్త సంవత్సరం 2026 వేడుకల ఉత్సాహం సామాన్యుడికి ధరల భారంతో మొదలైంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో నిత్యావసరాల ధరలు రెట్టింపు అయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా కూరగాయల దిగుబడి తగ్గి, మార్కెట్‌లో కిలో టమాటా, బీర, బెండ వంటివి రూ. 80 నుండి రూ. 100 వరకు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి, మునగకాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. కూరగాయలతో పాటు కోడిగుడ్లు (ఒక్కటి రూ. 8), చికెన్ (కిలో రూ. 300) ధరలు పెరగడం ప్రజలకు షాకిస్తోంది. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో డిమాండ్ పెరిగి.. సరఫరా తగ్గడం వల్ల రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
Read Entire Article