కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు జిమ్‌లో స్వల్ప గాయం.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స.. ఇప్పుడెలా ఉందంటే?

2 weeks ago 3
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షుకు జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా సోమవారం సాయంత్రం స్వల్ప గాయమైంది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్, హరీశ్ రావు ఆస్పత్రికి చేరుకుని హిమాన్షును పరామర్శించారు. తాను క్షేమంగా ఉన్నానని, చిన్న గాయం కావడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారని హిమాన్షు ట్వీట్ చేయగా.. మరికొద్ది రోజుల్లోనే హిమాన్షు పూర్తిగా కోలుకుంటాడని కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Read Entire Article