కనిపించకుండా పోయిన విజయవాడ యువకుడు సాయికృష్ణ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అతడ్ని లాకప్ డెత్ చేశారని కుటుంబం, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి ఓదార్చారు.