Tdp Candidate Honey Spandana Wins Chirala Municipality Chairperson: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మరో మున్సిపాలిటీ కూటమికి దక్కింది. మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థి ఎరిచెర్ల హనీ స్పందన 6,408 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 44 వార్డులు ఉండగా.. 22 చోట్ల టీడీపీ, కాంగ్రెస్ 10, వైఎస్సార్‌సీపీ 8, జనసేన పార్టీ 2, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.