Kuppam And Srikakulam Airports Site Clearance Update: కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల ఏర్పాటుకు సైట్ క్లియరెన్స్ వచ్చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్‌ఎఫ్‌పీ జారీకి ఏపీఏడీసీఎల్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 9 విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఇప్పుడు ఒక్కొక్కటిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి క్లియరెన్స్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఈ 9 విమానాశ్రయాలను రూ.6,418 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.