తెలంగాణ కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వేతనాల పెంపు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా వివరించారు. ఇక వేతనాల పెంపుతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు కేటగిరీలుగా కార్మికులను విభజించి.. వేతనలు పెంచినట్లు తెలిపారు.