కానిస్టేబుళ్లకు తీపికబురు.. త్వరలోనే భారీగా పదోన్నతులు, సరికొత్త ప్రమోషన్ విధానం

2 months ago 20
తెలంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుళ్లు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందేందుకు పడుతున్న సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది నిష్పత్తిని సవరించి 4 (కానిస్టేబుల్) : 2 (హెడ్‌కానిస్టేబుల్) : 1 (ఏఎస్సై) నిష్పత్తిని అమలు చేయాలని డీజీపీ ప్రభుత్వానికి నివేదించారు. దీనివల్ల దాదాపు 15,582 మందికి పదోన్నతులు లభించనున్నాయి. తద్వారా సిబ్బందిలో నిస్తేజం తొలగి పనితీరు మెరుగుపడుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త ప్రమోషన్ల విధానంపై సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Entire Article