కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ షర్మిల.. కూతురు పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం

4 hours ago 1
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన భర్తతోపాటు.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని స్వయంగా కలిశారు. తమ కుమార్తె అంజలిరెడ్డి పెళ్లికి రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి వివాహ పత్రికను అందజేసి, కాబోయే వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా షర్మిల కోరారు. ఈ సందర్భాన్ని వైఎస్ షర్మిల ఎక్స్‌ వేదికగా అందరితో పంచుకున్నారు. రాహుల్‌గాంధీని స్వయంగా కలసిన ఫోటోని కూడా షేర్ చేశారు. కాగా వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి నవంబర్ 25వ తేదీన జరగనుంది. సంబంధిత రిసెప్షన్ డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్నారు.
Read Entire Article