కల్వకుంట్ల కవితకు గాయాలు.. అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు..

7 months ago 19
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్‌ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.
Read Entire Article