కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పేరుపై ప్రజా అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించింది. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, లేదంటే దరఖాస్తును రద్దు చేస్తామని ఈసీ స్పష్టం చేసింది. అయితే కొత్త పేర్లు ఇచ్చేది లేదని, న్యాయపోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ బీఆర్‌ఎస్‌గా మార్చిన పాత 'టీఆర్‌ఎస్' సెంటిమెంట్‌ను కొనసాగించాలనే వ్యూహంతోనే కవిత ఇటీవల ఈ పార్టీని ప్రకటించారు.