అత్యంత ఖరీదైన సెక్యూరిటీ లాకర్లు ఉన్నా.. యజమానుల అలవాట్లే ఒక్కోసారి కొంపముంచుతాయని నిరూపించే ఉదంతం గచ్చిబౌలిలో వెలుగుచూసింది. పది కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, వెండి వస్తువులను దాచిన వ్యాపారవేత్త.. ఆ లాకర్ తాళం చెవిని పక్కనే ఉన్న కలశం చెంబులో దాచడం... కొత్తగా చేరిన నేపాలీ నౌకర్లకు సులభమైన మార్గాన్ని చూపించింది. యజమాని కుటుంబం ఢిల్లీ వెళ్లిన కొన్ని గంటల్లోనే ఇల్లు ఊడ్చేసిన ఈ కిలాడీ దంపతులను సైబరాబాద్ పోలీసులు అతి త్వరగానే పట్టుకున్నారు. యూపీలో అరెస్ట్ చేసి విమానం ద్వారా ఇక్కడికి తీసుకు వచ్చారు.