కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా సైదాపూర్, కడేచూరు పారిశ్రామికవాడల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో రసాయన దుర్వాసనతో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. పరిశ్రమల వ్యర్థ జలాలను వాగులోకి వదులుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ సమస్యపై మౌఖిక ఫిర్యాదులు అందాయని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.