విద్యుత్ ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఎస్పీడీసీఎల్ సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. 1912 కాల్ సెంటర్‌కు ప్రత్యామ్నాయంగా సెక్షన్ల వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ గ్రూపుల్లో లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, ఏఈలు సభ్యులుగా ఉంటారు. వినియోగదారులు నేరుగా సమస్యలను తెలియజేయడంతో పాటు పవర్ కట్లు, నిర్వహణ పనుల సమాచారం కూడా ముందుగానే అందేలా చర్యలు తీసుకోనున్నారు.