కడప: పవన్ కళ్యాణ్ అన్నా.. నువ్వే న్యాయం చేయాలి.. నువ్వు చెప్పేదాకా రోడ్డుపైనే .. కుటుంబం ఆందోళన

4 months ago 17
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ కడపలో ఓ కుటుంబం రోడ్డెక్కింది. ఎమ్మెల్యే బంధువులు తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. అర్ధరాత్రి సమయంలో తమ ఇంటిని జేసీబీలతో కూల్చివేసి.. తమను రోడ్డుపైకి లాగేశారంటూ ఆందోళనకు దిగింది. చిన్నారులు, వృద్ధులను కూడా బలవంతంగా బయటకు లాగేశారని.. తన మంగళసూత్రాన్ని కూడా లాక్కెళ్లారంటూ మహిళ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తమతో మాట్లాడి న్యాయం చేసేవరకూ ఇక్కడి నుంచి కదలమంటూ రోడ్డుపై బైఠాయించారు.
Read Entire Article