కడప అమీన్ పీర్ దర్గాలో హీరో రామ్ చరణ్

1 year ago 26
కడప పెద్ద దర్గాను హీరో రామ్‌ చరణ్ సోమవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకున్న రామ్‌ చరణ్.. అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక గంధం మహోత్సవం కార్యక్రమానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుటుంబంతో కలిసి హాజరయ్యారు. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో ఉన్న రామ్‌చరణ్.. వీలు చూసుకుని వస్తానని దర్గా నిర్వాహకులకు మాట ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారమే ముషాయరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. రామ్‌చరణ్ రాక నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు
Read Entire Article