కట్నం కింద బైక్ కొనివ్వలేదని దారుణం.. భార్యను ఉరేసి చంపి.. భర్త కూడా ఆత్మహత్య..!

1 month ago 12
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో అదనపు కట్నం వేధింపులు ఒక నవవధువు ప్రాణాన్ని బలిగొనగా, నిందితుడైన భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. మారేపల్లి శివారులోని ఒక మామిడితోటలో నివాసముంటున్న దాసరి అంజయ్య, అత్తింటివారు తనకు ద్విచక్రవాహనం కొనివ్వలేదన్న కోపంతో భార్య యాదమ్మను గదిలో చున్నీతో ఉరేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఈ హత్య కేసు ఎక్కడ పోలీసుల వరకు వెళ్తుందోననే ఆందోళనతో ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఉన్న మామిడి చెట్టుకు ఉరేసుకుని తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Read Entire Article