Andhra Pradesh Bamboo Cultivation Profit: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు వెదురు సాగు దిశగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో 3వేలమంది వెదురు సాగు చేస్తుండగా.. తాజాగా మరో 35వేలమందితో సాగు చేయించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు త్రిపుర నుంచి వెదురు మొక్కల్ని తెప్పించనున్నారు. ఒకసారి ఈ వెదురు మొక్క నాటితే 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు.