హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన గ్లోబల్ కూలింగ్ సొల్యూషన్స్ మేనేజింగ్ పార్టనర్ జయసుధ, ఏసీ వ్యాపారంలో పెట్టుబడులపై 4 శాతం నెలవారీ లాభం ఇస్తానని నమ్మించి ఆరుగురు ఇన్వెస్టర్లను రూ. 6.8 కోట్లకు మోసం చేశారు. 2022లో ప్రారంభమైన ఈ పెట్టుబడుల ప్రక్రియ.. 2025లో నిందితులు పరారు కావడంతో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు వినీల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. అధిక లాభాల పేరుతో చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.