ఏసీబీ వలలో ట్యాపింగ్ కేసు నిందితుడు ASP భుజంగరావు.. రూ.100 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు..!

1 month ago 12
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ బుధవారం అరెస్ట్ చేసింది. హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన సోదాల్లో రూ.5.92 కోట్ల రిజిస్ట్రేషన్ విలువ విలువైన చర, స్థిరాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ఏడాది జూలైలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఈలోపే అరెస్ట్ జరగడం గమనార్హం.
Read Entire Article