ఏసీబీ వలలో జలమండలి అధికారి.. కారులో రూ.2.40 లక్షలు, లెక్కల్లో లేని నగదు పట్టివేత

1 week ago 13
హైదరాబాద్‌లోని జలమండలి జాయింట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్ కారులో రూ.2.40 లక్షల లెక్కల్లో లేని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అజ్ఞాత సమాచారం ఆధారంగా శనివారం రాత్రి రాజ్‌భవన్‌ రోడ్డులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగదుకు సంబంధించి ఆయన ఇచ్చిన వివరణపై అనుమానాలు వ్యక్తం కావడంతో పంచనామా నిర్వహించి సొమ్మును సీజ్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Entire Article