ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ.. మహేశ్వరంలో 'ఐటీపీ ఏరో' ప్లాంటు, 3 వేల మందికి ఉద్యోగాలు

1 month ago 10
తెలంగాణను గ్లోబల్ ఏరోస్పేస్, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రూ.453 కోట్లతో 'ఐటీపీ ఏరో' విమాన విడిభాగాల కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు భూమిపూజ చేయగా.. జర్మన్ రసాయన దిగ్గజం బీఏఎస్‌ఎఫ్‌ హైదరాబాద్‌లో రెండు గ్లోబల్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 3600 మందికి పైగా నిపుణులకు ఉపాధి లభించనుంది. ఏడాదిలో 100 జీసీసీల ఏర్పాటు ద్వారా లక్ష ఉద్యోగాల సృష్టి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.
Read Entire Article