Andhra Pradesh Govt Banned New Bore Wells In 258 Villages: ఏపీ ప్రభుత్వం కొత్తగా బోర్లు తవ్వకుండా నిషేధం విధించింది. మొత్తం 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో బోర్ల తవ్వకాలను నిషేధించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే జనాల కోసం తాగునీటి అవసరాలకోసం మాత్రం బోర్లు వేసుకోవచ్చు. ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.