AP Engineering Colleges Minimum Fees: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల్ని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంజినీరింగ్ కాలేజీలలో కనీస ఫీజు రూ.47 వేలుగా ఫిక్స్ చేశారు. కమిటీ నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తారు.. అనంతరం ఆమోదించనున్నారు. మరోవైపు ఈ నెల 20 నుంచి ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్టు 10 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.