ఏపీలో వారందరి అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తాం.. చంద్రబాబు కీలక ప్రకటన

1 year ago 37
Andhra Pradesh Flood Relief Funds Release: ఆంధ్రప్రదేశ్‌లో గత నెలలో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఇప్పటికే వరద సాయం డబ్బులు జమ చేశామని.. మిగిలిన 796 మందికి ఇవాళ వారి అకౌంట్లలో పరిహారం జమచేస్తామన్నారు. అంతేకాదు వరద బాధితుల అకౌంట్ల వివరాల్లో తప్పులు, ఇతర సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిహారం కోసం వచ్చే ప్రతి దరఖాస్తు పరిశీలించాలని అధికారులకు సూచించారు.. ఒకవేళ అర్హులు ఉంటే తప్పకుండా సాయం అందేలా చూడాలని ఆదేశించారు. సచివాలయాల్లో లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ప్రదర్శించాలన్నారు.
Read Entire Article