ఏపీలో వారం రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

1 year ago 32
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఈదురు గాలులు కూడా వీస్తాయని అంచనా వేసింది.
Read Entire Article