ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఎవరా నలుగురు.. 'ఆమె'కు అవకాశం ఇస్తారా?

1 month ago 12
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ చేపడతారు. మరోవైపు షెడ్యూల్ ప్రకటించటంతో ఇవాళ్టి నుంచే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 8వ తేదీ వరకూ గడువు ఉండగా.. జూన్ 11వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. మరోవైపు ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. పెద్దలసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరా అనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Entire Article