Andhra Pradesh Matsyakarula Sevalo Scheme Rs 20000 On May 19th: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలపై సమీక్ష చేశారు. అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి, దివ్యాంగశక్తి, తల్లికి వందనం పథకాలపై కీలక ప్రకటన చేశారు. దీపం 2.0 పథకానికి రూ.3504 కోట్ల మేర ఖర్చు చేశామని.. స్త్రీ శక్తి పథకం కింద ఏడాదికి రూ.1940 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మందికి రూ.10 వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 19న మత్స్యకారుల సేవ పథకాన్ని అమలు చేస్తామన్నారు.