Appsc On Fake Job Notification Rumours: కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి షెడ్యూల్ వైరల్ అవుతోంది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఏపీపీఎస్సీ స్పందించింది, కీలక ప్రకటన చేసింది. ఏపీపీఎస్సీ అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఒకవేళ ఏదైనా నోటిఫికేషన్ ఉంటే అధికారికంగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది.