ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ విధానానికి స్వస్తి పలికి జనాభా సంరక్షణ దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న యువత సంఖ్య, పెరుగుతున్న వృద్ధుల జనాభాను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15 నుంచి నూతన పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని అమలు చేయనుంది. రూ. 782.25 కోట్ల బడ్జెట్‌తో సంతానోత్పత్తి రేటు పెంపుదల, ఐవీఎఫ్ సౌకర్యాలు, ప్రసూతి సెలవుల పొడిగింపు వంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో 'ఆరోగ్యాంధ్ర' లక్ష్యంగా ఈ ప్రణాళిక సాగనుంది.