ఏపీలో కొత్త ఫ్లైఓవర్.. అక్కడే, తీరనున్న ఏళ్ల నాటి కల.. చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన

1 year ago 19
Guntur Sankar Vilas Flyover: గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. గుంటూరు వాసుల ఎన్నో ఏళ్ల కలను నెరవేరుస్తూ మే ఏడో తేదీన గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రెండేళ్లలోగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు శంకుస్థాపన కోసం అధికారులు స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
Read Entire Article