కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలోని పలు రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళగిరి రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద రూ.12.56 కోట్ల వ్యయంతో మంగళగిరి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తికావటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో మంగళగిరి రైల్వేస్టేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.