Talliki Vandanam Scheme 2026 To Orphans Also: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్ పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే నంబర్-1గా నిలిచిందని మంత్రి తెలిపారు. అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం ప్రయోజనాలు అందించాలని సూచించారు. సంరక్షకులు లేకపోతే జిల్లా కలెక్టర్ ద్వారా డబ్బులు పంపిణీ చేయాలని సూచించారు. మెగా పీటీఎం నాటికి విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని పూర్తి చేయడమే టార్గెట్ అన్నారు.