ఏపీలో అప్పటికల్లా చెత్త లేకుండా చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

2 days ago 3
అక్టోబర్ రెండో తేదీ నాటికి రాష్ట్రంలో చెత్త లేకుండా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. చెత్త ద్వారా సంపద సృష్టించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. స్వచ్ఛరథాల ద్వారా చెత్తను కొనుగోలు చేస్తున్నామని.. ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ద్వారా సంపద సృష్టికి పనిచేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో చెత్త లేకుండా చేస్తామని ప్రకటించారు.
Read Entire Article