విశాఖపట్నానికి మరో పెట్టుబడి రానుంది. విశాఖ సమీపంలోని పరవాడ ఇండస్ట్రియల్ పార్కులో సోలార్ సెల్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. రూ.16 వందల కోట్ల పెట్టుబడితో గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. 3.5 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ యూనిట్ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 34 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ యూనిట్ ద్వారా వేయి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.