ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం!.. ప్రభుత్వం సీరియస్.. అసలు విషయం ఏమిటంటే?

2 months ago 20
ఆంధ్రప్రదేశ్ సచివాలయంపై డ్రోన్‌ కలకలం అంటూ శుక్రవారం సాయంత్రం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వదంతులు అన్నీ అబద్ధమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.. ఇలా వదంతులు వ్యాప్తి చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగుతున్నప్పుడు.. సచివాలయంపై డ్రోన్‌ కలకలం అంటూ వదంతులు వ్యాప్తి చేయటంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తున్నఓ విమానాన్ని డ్రోన్ అంటూ.. కావాలనే తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని పోలీసులు గుర్తించారు. కలెక్టర్ల సదస్సు అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
Read Entire Article