ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. సచివాలయంలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన బాలినేని.. అనేక అంశాలపై చర్చించారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, కూటమి బలోపేతం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇలా అనేక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. మరోవైపు వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలినేని సీఎం చంద్రబాబుతో భేటీ కావటం ఇదే తొలిసారి.