ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు.. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను అరెస్ట్ చేశారు. ఇటీవలె కారుమూరి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. కీలక పత్రాలు సేకరించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కారుమూరి సునీల్‌ను అరెస్ట్ చేశారు. మరికాసేపట్లోనే కారుమూరి సునీల్‌ను కోర్టు ముందు హాజరు పరచనున్నారు.